నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జన్మించిన వెంటనే శిశువుకు తల్లి ముర్రపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి మానసిక శరీరిక ఎదుగుదలకు తోడ్పడుతుందని తల్లిపాలు బిడ్డకి మొదటి టీకా అని, తల్లి పాలు ఎంతో అవసరమని సులువుగా జీర్ణము అవుతుందని తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్లు రావని తల్లులు ఆరోగ్యంగా ఉంటారని పిల్లలు ఎదుగుదల పెరుగుతుందని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో జ్ఞానేశ్వరి గారు,సూపర్వైజర్ విజయ రాణి, గ్రామ సర్పంచ్ పూజ అజయ్,అంగన్‌వాడీ టీచర్లు రజిత కరుణ సరిత సుశీల శ్రావణి అనూష కనక , ఆయాలు, ఆశా కార్యకర్తలు గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
దేవక్కపేటలో తల్లిపాల వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



