- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 143పై ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, ట్రక్కు డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం అనంతరం అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కట్టర్లతో బస్సును కట్ చేసి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



