Monday, June 29, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యుత్ ప్రైవేటీకరణకై తెచ్చిన రైతు డిస్కంను వెనక్కి తీసుకోవాలి

విద్యుత్ ప్రైవేటీకరణకై తెచ్చిన రైతు డిస్కంను వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం పెంచిన పొటాష్, భాస్వారం, కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్
నవతెలంగాణ-పెబ్బేరు 

విద్యుత్ ప్రైవేటీకరణ కోసం తెచ్చిన రైతు డిస్కౌంట్ వెనక్కి తీసుకోవాలి అని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పటాస్, బాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెబ్బేరు పట్టణంలో రెండో రోజు రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా పథకంలో పెండింగ్లో ఉన్న గత యాసంగి మరియు ప్రస్తుత వానకాలం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.

గత యాసంగి మరియు ప్రస్తుత వానకాలం సన్న ధాన్యం బోనస్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, వ్యవసాయ రంగంలో విద్యుత్ ప్రైవేటీకరణకు దారితీసే రైతు డిస్కంను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొటాష్, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువుల పెరిగిన ధరలను తగ్గించి రైతులకు అందుబాటులో ఉంచాలని, యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు సులభంగా ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ డిపాజిట్లలో కనీసం 18 శాతం వ్యవసాయ రంగానికి పంట రుణాలుగా అందించాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలు మంజూరు చేయాలని, కిసాన్ సమ్మాన్ పథకాన్ని జిల్లాలోని అర్హులైన రైతులందరికీ వర్తింపజేయాలని తెలిపారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) క్లస్టర్ స్థాయిలో నేరుగా పోలాలకు వెళ్లి క్రాప్ బుకింగ్ ప్రక్రియను నిర్వహించి, నకిలీ, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (MSP) ప్రకటించి అమలు చేయాలని, జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి బాల్ రెడ్డి, మాండ్ల రాజు, మండల నాయకులు జి బాలయ్య, భాస్కర్, దేవన్న, పెద్ద కాజా, సాయి లీల, రేణుక, శాంతమ్మ, లలితమ్మ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -