- సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్: సర్(Special Intensive Revision) ప్రక్రియ ప్రజలను వేధింపులకు గురిచేస్తోందని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఓ బిల్లు సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని లోక్ సభలో ఓడించాం దానికి బదులుగా సర్ ప్రక్రియను మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.
“రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టకుండా నిరోధించడానికి, మిమ్మల్ని(ప్రజలను) నిరంతరం వేధించడానికే ఎస్ఐఆర్ (SIR)ను ఉపయోగిస్తున్నారని, సవరణ ప్రక్రియ వల్ల తలెత్తిన సమస్యల కారణంగా ప్రజలు తమ పౌరసత్వంపై ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని, కేవలం ఎస్ఐఆర్ (SIR)లో వారి పేర్లు లేనందువల్ల, అత్యంత ప్రముఖులు కూడా తమ పౌరసత్వంపై ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని నేను విన్నాను, ఈ అధికారిక చిక్కుముడిలో మనం ఎంత లోతుగా చిక్కుకుంటున్నామో ఒక్కసారి ఊహించండి. 2027లో ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది” అని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాగా,ఈ ఏడాది జనవరిలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా నుండి 2.89 కోట్ల పేర్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు.



