- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పలు చోట్ల విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని బోరింగ్ అండ్ లేడీ కర్జాన్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న పాత కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో, దాని కింద ఆశ్రయం పొందుతున్న ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు.
- Advertisement -



