Sunday, May 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం)

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

– పేరుకుపోతున్న నిల్వలు.. రైతులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండలంలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్మేందుకు రైతులు కేంద్రాలకు వస్తే గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

మండలంలో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతున్నప్పటికీ కేవలం ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రాల సంఖ్య పెంచి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు పానుగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -