- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైనేజీల తదితర అభివృద్ధి సిఆర్ఆర్ నిధుల కింద రూ.15 కోట్లు కేటాయింపులో భాగంగా మండలానికి రూ.1 కోటి 60 లక్షలు కేటాయిస్తే అందులో ఎడ్లపల్లి గ్రామానికి అధిక నిధులు రూ.30 లక్షలు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామ ప్రజల తరుపున మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



