Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అకాల వర్షంతో రైతన్న ఆగం

అకాల వర్షంతో రైతన్న ఆగం

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని ఐకెపి పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.. కానీ సెంటర్లో కాంటాలు ప్రారంభమై కొన్ని ప్రారంభం కాలేదు. అకాల వర్షం రావడంతో కొన్ని సెంటర్లో ఉన్న ధాన్యం తడుస్తుందని రైతాంగం గాలి రావడంతో ధాన్యాన్ని తడవకుండా పరదాలు కప్పి కొంతమంది జాగ్రత్త పడ్డారు. మరి కొంతమంది దాన్నే కొన్ని సెంటర్లు తడిసినట్లు రైతులు చెబుతున్నారు. సెంటర్లో కాంటాలు హమాలీలను పెంచి వెంట వెంటనే కాంటాలు నిర్వహించి లారీల ద్వారా మిల్లర్లకు తరలించాలని రైతుల కోరుతున్నారు. కానీ మిల్లలు వద్ద లారీలో ఉన్నట్లు దిగుమతి చేసుకోవడం లేదని కొంతమంది చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి కోరుతున్నారు. రైతులు ఆరుగాలంకరించి పండించిన పంటకు చేతికందేసరికి అకాల వర్షం, గాలి ద్వారానికి తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యాన్ని కాంటాలు నిర్వహించి తరలించాలని రైతుల కోరుతున్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -