– రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్..
నవతెలంగాణ – రాయపోల్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 8 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి, ఆర్టీసీకి సంబంధించి ఒకటి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి రెండు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నాలుగు మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణమోహన్, ఏవో నరేష్, విద్యుత్ ఏఈఈ శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈఈ విద్యాసాగర్, మిషన్ భగీరథ ఏఈఈ అభినయ్, ఆర్ అండ్ బి ఏఈఈ రాజేశ్వరి, ఇరిగేషన్ ఏఈఈ జ్యోతిర్మయి, వైద్యాధికారి డా. మహారాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి గీతాంజలి, ఏపీఎం యాదగిరి, వెటర్నరీ డాక్టర్ సయ్యద్, ఐసిడిఎస్ సూపర్వైజర్ షబానా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జహంగీర్, ఏపీవో జనార్ధన్, సిఆర్పి యాదగిరి, జిపిఓ కరుణాకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



