Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీధర్ బాబుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పుట్ట

మంత్రి శ్రీధర్ బాబుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

నవతెలంగాణ–కాటారం
మంథని–కాటారం రహదారి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రూ.3 కోట్లతో ప్రారంభించిన ఈ రోడ్డు పనులు 30 నెలలు గడిచినా పూర్తి చేయకపోవడం దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అసమర్థతకు నిదర్శనమని అన్నారు. సోమవారం కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో డీఎంఎఫ్టీ నిధులతో రూ.300 కోట్లతో 90 శాతం పూర్తి చేసిన రహదారిని ఇప్పుడు పూర్తిచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా నియోజకవర్గ అభివృద్ధిలో మార్పు లేదని అన్నారు.

ప్రజలు ప్రతి ఎన్నికలో భారీ మెజార్టీ ఇస్తున్నప్పటికీ, కాటారం ప్రాంతానికి కనీస సదుపాయాలు కూడా అందకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓట్లు వస్తే నోట్ల సంచులతో గెలుస్తామనే అహంకారం అధికార కుటుంబంలో ఉందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రహదారి పనులను పూర్తి చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటు విలువను గుర్తించి ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలని, యువత ముందుకు వచ్చి సమాజంలో అవగాహన కల్పించాలని పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు.అయన వెంట మాజీ జడ్పి ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, కాటారం బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, కాటారం సర్పంచ్ పంతకాని సడువలి, ప్రతాపగిరి సర్పంచ్ ఊర వెంకటేశ్వర్ రావు, నరివేద్ది శ్రీనివాస్,బీ ఆర్ ఎస్ అభిమానులు, బీ ఆర్ ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -