Saturday, July 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి..10 మంది అరెస్ట్  

పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి..10 మంది అరెస్ట్  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలోని చీతా ఫోర్స్ బృందం శనివారం నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్‌పల్లి గ్రామ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌పై విశ్వసనీయ సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించింది.దాడి సందర్భంగా గెస్ట్ హౌస్‌లో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, గుట్కా, మత్తు పదార్థాల విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -