Monday, May 4, 2026
E-PAPER
Homeక్రైమ్లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గంమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -