Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంనన్ను అడ్డుకోవాలంటే, నన్ను చంపాల్సిందే: మమతా బెనర్జీ

నన్ను అడ్డుకోవాలంటే, నన్ను చంపాల్సిందే: మమతా బెనర్జీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల పై టీఎంసీ అధినేత మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు ద్రోహులన్ని అభివర్ణించారు. తృణమూల్ పార్టీ గుర్తు తన పక్షాన నిలిచిన వర్గం వద్దే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. “పార్టీ గుర్తు ఎక్కడికీ పోదు. నన్ను అడ్డుకోవాలంటే, నన్ను చంపాల్సిందే,” అని ఆమె అన్నారు. శనివారం నాడు చంద్రమా భట్టాచార్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. “చంద్రిమ భట్టాచార్య కుమారుడు గతంలోనే తృణమూల్ వ్యతిరేక వర్గంతో చేరారని, ఆమె రాజీనామా చేయనున్నట్లు తనకు ముందే సమాచారం ఇచ్చారని మమతా తెలియజేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో ఒక వర్గంగా విడిపోగా, లోక్‌సభ ఎంపీలు మరో వర్గాన్ని (మూడవ కూటమిని) ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -