నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలల్లో బీజేపీ(అసోం, పశ్చిమ బెంగాల్, యూటీ పుదుచ్చేరి) మూడు, కాంగ్రెస్ ఒకటి(కేరళం) దక్కించుకున్నాయి. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ అఖండ విజయం సాధించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే ఆధిక్యతతో ఆయా రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రానుందో తెలిపోయింది. కాగా, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. ఇక బెంగాల్, తమళనాడు లెక్కింపు కొనసాగుతుంది.
కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు యూడీఎఫ్‌కు 102 గెలుపొంది అధికారం చేపట్టనుంది. ఎల్‌డీఎఫ్ 35, ఎన్డేయే మూడు గెలుచుకున్నాయి.
అసోంలో 126 అసెంబ్లీ సీట్లకు బీజేపీ 102 స్థానాలను కైవసం చేసుకోని మరోసారి అధికారం నిలుపుకుంది. కాంగ్రెస్ 21, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు.
పుదుచ్చేరి(30)లో ఎన్నార్ కాంగ్రెస్ 10, బీజేపీ 4, డీఎంకే 5, టీవీకే 2, ఎల్‌జేకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్, నెయ్యం మక్కల్ కళగమ్ తలా ఒక్క స్థానం కైవసం చేసుకున్నాయి. ఇతరులు 3 సీట్లల్లో గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్(294): బీజేపీ 180 సీట్లను గెలువగా, 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 68 స్థానాలను గెలిచి, 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 2, వాపక్షాలు రెండు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు.
తమిళనాడు(234): టీవీకే 95 స్థానాలను గెలువగా 11 ఆధిక్యంలో ఉంది. డీఎంకే 58 సీట్లల్లో గెలిచి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నా డీఎంకే 45 స్థానాలు గెలుచుకుంది. 8 సీట్లల్లో ఆధిక్యంలో ఉంది.



