అధికార తృణమూల్‌కు మరో షాక్
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర సీఎం, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమిని చవి చూశారు. బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై 15 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా.. అక్కడి నుంచి కూడా పోటీ చేసిన సువేందు అధికారి మమతను ఓడించారు. దీంతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం అనివార్యం కావడంతో ఆ తర్వాత ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేసి, గెలిచి సీఎం పదవిలో కొనసాగారు. ఈ సారి కూడా భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమతను సువేందు అధికారి ఓడించడం గమనార్హం.
అనైతికం.. అక్రమం
ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన గెలుపుకాదు : ఓటమిపై మమత స్పందన
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తమ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, ఆమె పోటీ చేసిన స్థానం నుంచి కూడా గెలవకపోవడంపై మాట్లాడిన ఆమె.. బీజేపీ విజయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన గెలుపు కాదనీ, పూర్తిగా లూటీ అని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను కూడా ఆమె టార్గెట్ చేశారు. ఈసీ బీజేపీ కమిషన్‌గా మారిందని అన్నారు. బీజేపీ సుమారు వందకు పైగా స్థానాలను లూటీ చేసిందని చెప్పారు. దీనిపై తాము చేసిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీది అనైతిక విజయమన్నారు. కేంద్ర బలగాలు, కేంద్ర మంత్రుల అండతో చేసిన అక్రమమని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి
- Advertisement -
- Advertisement -



