Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ నోట్ల చలామణి

నకిలీ నోట్ల చలామణి

- Advertisement -

ఎనిమిది మంది అరెస్ట్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

నకిలీ నోట్లను తయారు చేసి ప్రింట్‌ తీసి మార్కెట్‌లో చలామణి చేస్తున్న ఎనిమిది మందిని వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ నోట్లను, నిజమైన రూ.1,48,000, సుమారు రూ.28లక్షల విలువగల ల్యాప్‌ టాప్‌లు, ప్రింటర్స్‌, 13 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. నిందితుల్లో నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్‌, నీరటి శివ, నీరటి రంజిత్‌, గుడికందుల రవి, ఘన్‌పూర్‌(ములుగు)కు చెందిన పోరిక రాజ్‌కుమార్‌ ఏ.రాజు, తనమాల రాజశేఖర్‌ (ఖమ్మం), భువనగిరి తాతానగర్‌కు చెందిన ముదురుకోల యాకంబరం, కొత్తగూడెం కారకగూడెం(మండలం)కు చెందిన చేను సాయికిరణ్‌ ఉన్నారు. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు రూ.100 నోట్లను ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ ద్వారా కలర్‌ ప్రింట్‌ తీసి మార్కెట్లో అసలు నోట్లుగా చలామణి చేస్తున్నారు. వారి ద్వారా సేకరించిన సమాచారంతో మిగిలిన ఐదుగురు వ్యక్తులను విచారించగా నేరం ఒప్పుకున్నారు. తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3లో తయారుచేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి రూ.500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితాలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో ఘనపూర్‌ (ములుగు), మోండా మార్కెట్‌ (సికింద్రాబాద్‌), వెంసూర్‌, కొత్తగూడెం, ఖఖజ మరియు సుబేదారీ పరిధిలో వారిపై కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, నర్సంపేట ఏసీపీ రవీందర్‌ రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబులాల్‌, నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట సిబ్బందిని సీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -