Wednesday, May 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు

యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు

- Advertisement -

125 డాలర్లకు చేరనున్న చమురు
వృద్ధి రేటు పతనమే..ఆకాశాన్ని అంటనున్న ధరలు
ఐఎంఎఫ్‌ చీఫ్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతున్నాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు గనుక 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పతనమయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. యుద్ధం త్వరగా ముగిసిపోతుందన్న ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నా యన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాము అంచనా వేసిన 3.1 శాతం ప్రపంచ వద్ధి రేటు, 4.4 శాతం ద్రవ్యోల్బణ గణాంకాలు ఇక ఏమాత్రం సాధ్యం కాకపోవచ్చన్నారు. ముఖ్యంగా యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 125 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. తద్వారా ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయని జార్జివా హెచ్చరించారు. ఇప్పటికే చమురు ధరలు 100 డాలర్ల దరిదాపుల్లో ఉండటంతో ప్రపంచం ఇప్పటికే ప్రతికూల స్థితిలోకి ప్రవేశించిందని ఆమె విశ్లేషించారు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం.. పరిస్థితి ఇలాగే ఉంటే 2026 నాటికి ప్రపంచ వద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయి, ద్రవ్యోల్బణం 5.4 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ యుద్ధం మరింత తీవ్రమైతే ప్రపంచ వద్ధి కేవలం 2 శాతానికి పరిమితమై.. ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరొచ్చని ఇది ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు. చమురు సరఫరా విషయంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలును షెవ్రాన్‌ సిఇఒ మైక్‌ విర్త్‌ వివరించారు. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హార్మూజ్‌ జలసంధి గనుక యుద్ధం కారణంగా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావం తొలుత ఆసియా ఖండంలోని దేశాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతాయని హెచ్చరించారు.ఎరువుల ధరలు 40 శాతం పెరగొచ్చు..కేవలం ఇంధన ధరలే కాకుండా సామాన్యుడి ఆహార భద్రతపై కూడా ఈ యుద్ధం పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాల వల్ల ఎరువుల ధరలు 30 శాతం నుండి 40 శాతం వరకు పెరిగాయన్నారు. దీని ఫలితంగా ఆహార వస్తువుల ధరలు 3 శాతం నుండి 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని జార్జివా తెలిపారు. ఈ సంక్షోభం త్వరలో ముగిసిపోతుందని భావించి వినియోగాన్ని తగ్గించకుండా ఉండటం అంటే మండుతున్న మంటల్లో పెట్రోల్‌ పోయడమేనని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -