Thursday, May 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహార్ముజ్‌:శాంతిని కొనసాగిస్తుందా?

హార్ముజ్‌:శాంతిని కొనసాగిస్తుందా?

- Advertisement -

ప్రపంచంలోని ప్రతిదేశం విషయంలో తలదూర్చడం అమెరికా నైజం. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చినంతా అవలీలగా ఇరాన్ అధ్యక్షుడిని కూడా ఎత్తుకొని వద్దామనుకున్నా ఆధునిక రావణుడికి పగటి పూట తారలే కనిపించాయి. అతడు దేశం కోసం అమరుడే అయ్యాడు గాని ట్రంప్ చేతిలో చిక్కలేదు. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించి పరిణామం చవి చూసి, హార్ముజ్ జలసంధిపై కన్ను పెట్టాడు ట్రంప్. అది కూడా అడియాశే అవుతుందేమో! హార్ముజ్ జలసంధి అమెరికా ఇజ్రాయిల్‌ ఇరాన్ యు‌ద్ధంలో ప్రముఖంగా వార్తల్లో కొచ్చింది. ఫిబ్రవరి 28న మొదలై నలభై రోజుల వరకు యుద్ధం బీభత్సంగా జరిగింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి హక్కు ఉందని, అది తమ ఆధీనంలో ఉండాలని నాటకమాడుతున్నది. అమెరికాకు దాని పై పెత్తనం ఏమిటి? అక్కడున్న చమురు మార్గం ఇరాన్ ఆధీనంలో ఉంది. దీన్ని కైవసం చేసుకోవడం డోనాల్డ్ ట్రంప్ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. కానీ ఇరాన్‌ ‌ఎత్తుకు పై ఎత్తుతో ప్రతిఘటిస్తోంది.యుద్ధ విరమణలో భాగంగా ఇరాన్‌ పది సూత్రాల ప్రణాళిక ప్రతిపాదించింది. అందులో ఒకటి హార్ముజ్ జలసంధి. ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో వాణిజ్య నౌకల రాకపోకలు ముఖ్యమైనది. అంతేగాక హార్ముజ్ పై ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్ ప్రొటోకాల్ ఏర్పాటు. ఇందుకోసం పరస్పర అంగీకారంతో కూడిన నిబంధనల రూపకల్పన. ఆమెరికా మాత్రం తన పదిహేను సూత్రాల ప్రణాళికలో, హార్ముజ్ జల సంధిని నిరంతరం తెరచి ఉండాలంది. యుద్ధం తిరిగి ప్రారంభమైతే జలసంధి గొడవే కేంద్రికృతమైఉంటుందేమో! యుద్ధ విరామం పఠించిన అమెరికా మంత్రంలో ఇజ్రాయిల్‌ స్వరం లేదు! ఏ సమయంలోనైన అది తన అపస్వర రాగం ఆలాపించగ లదు.యూరోపియన్, నా‌టో దేశాలు పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనడానికి ఏ దేశం కూడా సమతంగా లేదు. ‘నీ పిచ్చి గొడవ నువ్వే చూసుకో’ అని అంటున్నాయి. ట్రంప్ కు అక్రమ సంబంధాల బేబి ఇజ్రాయిల్‌ను తన ఒళ్లో పెట్టుకొని అన్యాయంగా పాలస్తీనియులను పొట్టన పెట్టుకున్న నెతన్యాహు మరో తల తిరిగిన పిశాచ గుణం కలిగిన ఇజ్రా‌యిల్‌ ప్రధాన మంత్రి. ఇద్దరికి జోడి బాగా కుదిరింది. ఇద్దరు దేశ అధినేతలే. తోడు నక్కలు. ఒకరికి చమురు కావాలి మరొకరికి నేల ‘గ్రేటర్ ఇజ్రాయిల్’ కోసం. ఈ పరిణామాల నేపథ్యంలో దాగుర్మూజ్వైపే తోంది హార్ముజ్ జలసంధి. ఒకసారి మూసుకుందంటే మరోసారి ‌తెరుచుకుంటోంది. కాల్పుల విరమణ ఉన్నంత వరకు హార్ముజ్ నుంచి నౌకల ప్రయాణం సాఫీగానే ఉంటుందని ఇరాన్‌ వెల్లడించింది. అందులో భాగంగానే భారత్‌‌కు కూడా అనుమతినిచ్చింది.కానీ, మన ప్రధాని మోడీ మ్రాతం అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్న తీరు సరికాదు.ఏది ఏమైనా, ఈ యుద్ధంలో ఎప్‌‌స్టీన్ ఫైల్స్ ను హార్ముజ్ జలసంధిలో లోతుగా పాతిపెట్టాలనుకొంటున్నాడు డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ ట్రాప్లు జగానికి తెలియనివి కావు. ఏది ఏమైనా హార్ముజ్ జలసంధి ఓ నిర్ణయాత్మక మార్గం సుగమం చేస్తుందని విశ్వసిద్దాం. ప్రపంచ శాంతికి పునాది వేస్తుందని ఆశిద్దాం.
– అమ్జద్, 73375 92686

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -