సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏడవ వర్ధంతి ఘన నివాళి
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ రైతు సంఘం జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్ తూపానికి పూలదండ ఎస్సి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మాట్లాడుతూ.. కామ్రేడ్ బొక్కా రాజు గోసిటి గొంగడేసి పాట పాడి ప్రజలకు అకట్టుకునేవారు. నీతి నిజాయితీగా నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించారని స్థానికంగా బల్మూరు మండల కేంద్రంలో గ్రామంలో సిసి రోడ్ కోసం కరెంటు కోసం మంచినీటి కోసం ఉపాధి హామీ కూలీ డబ్బుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని, వారు చేసిన ప్రజా పోరాటాల ద్వారా స్థానిక సమస్యలు పరిష్కరించబడ్డాయని గుర్తు చేశారు.
ఈ గ్రామంలో సీపీఐ(ఎం) రాజకీయంగా ఎర్రజెండా ఎగిరేసిన నాడీ వారికి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని వారు అన్నారు. ఆశయ సాధనకై ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఎండీ లాల్ మహ్మద్ బాబర్ సీనియర్ నాయకులు బాలేశ్వరయ్య శ్రీరామ్ శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ఖదీర్ కుటుంబ సభ్యులు అరుణ మహిళలు రజియా బేగం వార్డు మెంబర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.



