Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

ఏపీఎంకు అందజేసిన నిరవధిక సమ్మె నోటీస్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని గురువారం మండలంలోని ఐకెపి విఓఏ జాయింట్ యాక్టివ్ మండల కమిటీ (జెఏసి సెర్ప్) అధ్యక్షురాలు అక్కల ప్రమీల, కార్యదర్శి బి.సరిత ఆధ్వర్యంలో మండల ఎపిఎం హనుమంతరావుకు కొయ్యుర్ మండల సమాఖ్య కార్యాలయంలో సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా విఓఎలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విఓఏ జెఏసి కమిటీ ఆదేశాల మేరకు తాము ఇటీవల సమావేశమైనట్లుగా తెలిపారు. తమ సమస్యల పరిస్కారం కోసం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరవధిక సమ్మె చేయనున్నట్లుగా పేర్కొన్నారు. విఓఏ సమస్యలైన కనీస వేతనం రూ.20 వేలు, సెర్ప్ ఉద్యోగులు గా గుర్తించి హేఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన విఓఏలను సిసిలుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ ఆరోగ్య బీమా రూ.20 లక్షలు కల్పించాలని, ట్యాబు సౌకర్యం కల్పించాలని, 58 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లోని 27 మంది విఓఎలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -