నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్లో మోది బహిరంగ సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రచ్చ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కొలనుపాక గ్రామము లో ఆలేరు మండల బీజేపీ అధ్యక్షులు పూజారి కుమార స్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించబడనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం కోసం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవంగా చూడటానికి కారణం నరేంద్ర మోదీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు, పారదర్శక పాలన, దేశభక్తి” అని పేర్కొన్నారు.“ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ప్రతి ఇంటికి గ్యాస్, ప్రతి రైతుకు గౌరవం,ప్రతి యువకుడికి అవకాశాలు, ప్రతి మహిళకు భద్రత – ఇవన్నీ మోదీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. దేశం అభివృద్ధి చెందాలంటే నిజాయితీ గల నాయకత్వం అవసరం.
గత ఎన్నికల్లో ప్రజలు కుటుంబ పాలనను, అవినీతి రాజకీయాలను తిరస్కరించి అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇచ్చారని తెలిపారు. దేశం బలంగా ఉండాలంటే బీజేపీ మరింత బలపడాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మోదీ బహిరంగ సభ దేశ భవిష్యత్తుకు మార్గదర్శక సభ అవుతుందని,ఆలేరు మండలం నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి అంకిరెడ్డి శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తేరాల శంకర్ కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్ శక్తి కేంద్రం ఇంచార్జ్ వడ్డేపల్లి కిషన్ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



