నవతెలంగాణ – ఆలేరు టౌన్: పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరి అని, ఆధార్ సెంటర్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్ అన్నారు. ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఏర్పాటుచేసిన యు డైస్ వర్క్ షాప్ ను, ఆధార్ సెంటర్ ను జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగారు సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆధార్ తప్పనిసరి అని, ఎవరైతే విద్యార్థులకు ఆధార్ లేదో , వారు కచ్చితంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను సందర్శించి ఆధార్ తీసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు బయోమెట్రీక్ అప్డేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల, ఎం. ఐ.ఎస్ చైతన్య, ఎల్.డి. ఏ రాధిక, సి.ఆర్.పి లు తిరుపతి, శ్రీనివాస్ లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



