Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది: రజనీకాంత్

ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది: రజనీకాంత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఆకస్మిక మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన 100వ సినిమాను తనతోనే తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారని, అందుకు తాను అంగీకరించానని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం చౌదరికి నివాళులర్పించిన అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. “నాలుగు నెలల క్రితం ‘జైలర్ 2’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. ‘నేను 99 సినిమాలు పూర్తి చేశాను. 100వ సినిమా తీసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ సినిమాలో మీరే నటించాలి. నా దగ్గర రెండు, మూడు కథలున్నాయి, మీరు తప్పకుండా ఈ సినిమా చేయాలి’ అని అడిగారు. దానికి నేను 100 శాతం చేస్తానని మాట ఇచ్చాను” అని రజనీకాంత్ వివరించారు. ఆర్బీ చౌదరితో తాను ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ, ఆయన తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -