Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో చలివేంద్రాలను ప్రారంభించిన సర్పంచులు

గ్రామాలలో చలివేంద్రాలను ప్రారంభించిన సర్పంచులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో గ్రామపంచాయతీ  ఆధ్వర్యంలో చలివింద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు మండలంలోని డోన్ గావ్ జిపి సర్పంచ్ శ్రీనివాస్ మరియు బస్వాపూర్ సర్పంచ్ వాగ్మారే రమణ చలివేంద్రాలను ప్రారంభించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో గ్రామాలలో త్రాగునీరు పరిశుభ్రమైనది అందించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామీణులకు నిరంధించాలని చలివేంద్రాలు ప్రారంభించామని అన్నారు. గ్రామాలలోని ప్రతి ఒక్కరు చలివేంద్రాలను ఉపయోగించి శుభ్రమైన నీటిని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డోన్గావ్ సర్పంచ్ శ్రీనివాస్, బస్వాపూర్ సర్పంచ్ రమణ, ఆయా గ్రామాల కార్యదర్శులు, జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -