ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామారెడ్డి
నవతెలంగాణ – బోనకల్
గ్రామాల అభివృద్ధికి తన నిధులనుంచి ఎక్కువ సంఖ్యలో నిధులు మంజూరు చేస్తున్నానని, గ్రామాలలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని చిరునోముల లలో రూ 4.50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు ఎంపీ రఘురామరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.
తూటికుంట్ల గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్ల పనులకు రఘురాంరెడ్డి శంకుస్థాపన చేశారు. ముష్టికుంట్లలో రూ. 5 లక్షలతో నిర్మించిన రోడ్డును ఎంపీ ప్రారంభించారు. పెద్ద బీరవల్లిలో రూ.4 లక్షల పనులకు, చిన్న బీరవల్లిలో రూ.4.50 లక్షల పనులకు, రాపల్లిలో రూ. 4 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపనలు చేశారు. బోనకల్ కేంద్రంలో రూ. 5 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం తన నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నానని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు.
ప్రాధాన్యత క్రమంలో గ్రామాలకు తన నిధులనుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తన నిధులకు తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామపంచాయతీలు ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాయి అన్నారు. వచ్చిన నిధులను గ్రామపంచాయతీలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రురావత్ రమాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బానోత్ జ్యోతి, అనుమోలు చంద్రకళ, తుళ్లూరు లక్ష్మీనరసయ్య, తాళ్లూరి వెంకట రాములు, సండ్ర సరిత, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, ఆయా గ్రామాల ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



