Thursday, May 7, 2026
E-PAPER
Homeఖమ్మంబోనకల్ రైల్వే స్టేషన్‌లో శాతవాహన, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఆపాలి 

బోనకల్ రైల్వే స్టేషన్‌లో శాతవాహన, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఆపాలి 

- Advertisement -

రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ – బోనకల్ 

బోనకల్ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లు నిలపాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డికి మండల ఆర్యవైశ్య సంఘం మండల ప్రజలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోని చిరునోములలో ఓ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామ రెడ్డికి మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు మండల ప్రజలు గురువారం వినతి పత్రం అందజేశారు. బోనకల్ రైల్వే స్టేషన్ సుందరీకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత కూడా ఈ స్టేషన్‌లో ఇంకా ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలిపివేత, స్థానిక రిజర్వేషన్ కౌంటర్ వంటి సౌకర్యాలు లేకపోవడం ప్రయాణికులలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆ వినతి పతలో పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖకు బోనకల్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని కానీ సౌకర్యాలు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బోనకల్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులు పూర్తయినప్పటికీ మౌలిక వసతుల కల్పించలేదని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. రఘురాం రెడ్డి ని స్థానిక సంఘాలు, సామాజిక సంస్థలు కలిసి రైల్వే స్టేషన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బోనకల్ స్టేషన్‌లో ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్ ఏర్పడితే వైరా, చింతకాని, బోనకల్ మండలాలతో పాటు ఏపీ రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంపీకి వారు వివరించారు.

బోనకల్ రైల్వే స్టేషన్ సుందరీకరణతో పాటు కొన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి కానీ, రైల్వే సేవల్లో ఎక్స్‌ప్రెస్ స్టాపేజ్, రిజర్వేషన్ కౌంటర్ వంటి సౌకర్యాలు ఇంకా లేకపోవడం ప్రయాణికులలో మరింత నిరాశను కలిగిస్తుందని ఆయనకు వివరించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే జోనల్ అధికారుల దృష్టికి ఈ ఈ సమస్యలను తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు ఎంపీ ని కోరారు. దీంతో ఎంపీ స్పందిస్తూ రైల్వే శాఖ మంత్రి తో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  ఆర్య వైశ్య సంఘం మండల అధ్యక్షుడు చెడె వెంకటేశ్వరరావు,  పల్లపోతు వెంకట గోపాలరావు, చన్నా సుధీర్ కుమార్,చన్నా భాను, గెల్లా ఉదయ్ కుమార్, చిరునోముల సర్పంచ్ అనుమోలు చంద్రకళ,  అనుమోలు వెంకటేష్, వెచ్చా నాగేశ్వరరావు, కలవల సుబ్బారావు, కొణతాలపల్లి నాగేశ్వరరావు, కటకం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -