Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో అధిక లాభాలు 

సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో అధిక లాభాలు 

- Advertisement -

విద్యుత్ జిల్లా అధికారి భీమా నాయక్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

సోలార్ విద్యుత్ ఏర్పాటుతో రైతులకు విద్యుత్ వినియోగ తో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని విద్యుత్ జిల్లా అధికారి బీమా నాయక్ చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా  గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్ శాఖ మరియు వ్యవసాయ శాఖ  ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ పై రెడ్ కో సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీఎం కుసుమ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మరియు బంజర భూముల్లో పలకాలను అమరపరిచి ఇట్టి పలకల ద్వారా విద్యుత్ రైతులు ఉత్పత్తి చేసి  అమ్ముకోవచ్చు అని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

 33/11 కిలో వాట్ సబ్ స్టేషన్ రైతు అమర్చుకున్న పాయింట్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అదేవిధంగా 0.5 నుంచి 2.0 మెగావాళ్ళ సౌర విద్యుత్ ప్లాంట్ 25 సంవత్సరాల లీజుగాను అమర్చుకోవచ్చు అని రైతులకు తెలిపారు. ప్రధాన మంత్రి సూర్య  యోజన పథకం కింద రైతులు ఇంటి పై కప్పు మీద సోలార్ పల్కలు అమర్చి విద్యుత్ని జనరేట్ చేసి ఒక యూనిట్ కి   రూపాయలు 3.14 పైసలు చొప్పున తెలంగాణ విద్యుత్ శాఖ వారికి అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఈ పథకం ద్వారా రైతు నేరుగా పిఎం సుర్య గర్ యోజన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని విద్యుత్ శాఖ వారిని సంప్రదించాలి. దీనికిగాను ప్రభుత్వం 80% వరకు సబ్సిడీ వస్తుంది. ఎస్సీ ,ఎస్టీ వారికి 100% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ఈ పథకం ద్వారా గృహ జ్యోతి లబ్ధిదారులు వారి యొక్క ఇంటి వినియోగం కోసం కరెంటును ఉపయోగించుకొని మిగతా విద్యుత్తును తెలంగాణ విద్యుత్ శాఖ వారికి అమ్ముకోవడం ద్వారా ఆదాయం రైతులకు వస్తుందని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేష్ మాట్లాడుతూ, ఈనెల నాలుగో తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాల సందర్భంగా విద్యుత్ వినియోగం పైన రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  జిల్లా విద్యుత్ శాఖ అధికారి పండారీ , ఏ ఈ నరేందర్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ,  ఎంపీడీవో గీతాంజలి,  సర్పంచులు  ఎర్ల్ శంకర్ , నాగరాజు గౌడ్, రాజు, గోపాలు, శ్రీశైలం యాదవ్, రాజు, అధికారులు ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -