Friday, May 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రణాళి కాబద్ధంగా రాష్ట్రాభివద్ధి

ప్రణాళి కాబద్ధంగా రాష్ట్రాభివద్ధి

- Advertisement -

ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ దానిలో భాగమే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రణాళికాబద్ధ అభివద్ధి కొనసాగుతున్నదనీ, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులన్నీ దానిలో భాగమేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పదేండ్లలో హైదరాబాద్‌కు గ్లోబల్‌ సిటీగా మారుస్తామనీ, దానికి తగినట్టే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నదనీ తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ రాష్ట్రవాటాను సాధించేందుకు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా అభివద్ధి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్‌ జీసీసీ సమ్మిట్‌ 2026’లో ‘బియాండ్‌ పాలసీ: డిజైన్డ్‌ టు విన్‌ ది గ్లోబల్‌ జీసీసీ రేస్‌’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047’గురించి వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల విధ్వంస నగరాలుగా మారాయనీ, కానీ హైదరాబాద్‌ విషయంలో తాము అలాంటి తప్పిదాలు చేయదలుచుకోలేదన్నారు. భవిష్యత్‌ నగరాన్ని తామే నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. దానిలో భాగంగానే భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివద్ధి, ఆర్‌ఆర్‌ఆర్‌,మూసీ ప్రక్షాళన, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్‌ హబ్‌ వంటి అనేక కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. బ్యాంకింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్‌ఎంసీజీ, స్పేస్‌ టెక్‌, ఆతిథ్య రంగాల్లో అనేక దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్‌నే తమ మొదటి ప్రాధాన్యంగా చుకుంటున్నాయని వివరించారు. గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయనీ, ఈ ఏడాది కొత్తగా మరో వంద జీసీసీలను ప్రారంభించి లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్‌ ఆఫీస్‌ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా, వాటిని ‘గ్లోబల్‌ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మ్యాప్‌’ను సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాస్కాం చైర్మెన్‌ శ్రీకాంత్‌, అధ్యక్షులు రాజేష్‌ నంబియార్‌ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -