Friday, May 8, 2026
E-PAPER
Homeకరీంనగర్ఘ‌నంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు…

ఘ‌నంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు…

- Advertisement -

నవతెలంగాణ–వేములవాడ: తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, కౌన్సిలర్లు ఏల శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -