Monday, September 7, 2026
E-PAPER
Homeఖమ్మంకవి 'మందపాటి'కి 'నన్నయ కవి' జాతీయ పురస్కారం’

కవి ‘మందపాటి’కి ‘నన్నయ కవి’ జాతీయ పురస్కారం’

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సత్తుపల్లి ప్రాంత కవి, విశ్రాంత ఉపాధ్యాయులు మందపాటి సత్యనారాయణరెడ్డికి ‘నన్నయ కవి జాతీయ పురస్కారం’ లభించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ‘ఎం.వి. రావు ఫౌండేషన్’ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్‌కృష్ణ, ఎం. విజయలక్ష్మి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పద్య సాహిత్యంలో దిట్టయిన మందపాటి, మొత్తం మహాభారతాన్ని 2,140 సీస పద్యాలతో ‘సర్వ సీస మహాభారతం’ పేరుతో రచించారు. కేవలం సీస పద్యాలతోనే మహాభారతాన్ని ఆవిష్కరించడం సాహిత్యంలో ఒక నూతన ప్రక్రియ కావడంతో ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా సృజన సాహితీ సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రామకృష్ణ, వాసు, మధుసూదనరాజు, కేశవరెడ్డి, ప్రకాశరావు తదితరులు కవి మందపాటికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -