Tuesday, September 8, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు, డీలర్లు

వ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు, డీలర్లు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను విద్యా పర్యటనలో భాగంగా వీకేడీవీఎస్ రాజు కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బోటనీ విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన డీఏఈఎస్ఐ డీలర్లు మంగళవారం సందర్శించారు. బోటనీ విద్యార్థులు 80 మంది, డీఏఈఎస్ఐ డీలర్లు 40 మంది ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సందర్శకులకు కళాశాలలో సాగు చేస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పంటలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రదర్శనా క్షేత్రాలు, వినూత్న వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ పంటల సాగు విధానాలను పరిశీలించి శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన పొందారు.

డీఏఈఎస్ఐ డీలర్లు ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగు, యాజమాన్య పద్ధతులు, ఉత్పాదకత, తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు ఉన్న అవకాశాలపై ఆసక్తి కనబరిచారు. ఆయిల్‌పామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు, ఆధునిక నీటిపారుదల విధానాలను పరిశీలించారు.

ఈ పర్యటనను డాక్టర్ పి. నీలిమ, డాక్టర్ రాములు, డాక్టర్ శివ సమన్వయం చేసి సందర్శకులకు సాంకేతిక సమాచారాన్ని అందించారు. ఏఈఎల్పీ విద్యార్థులు వివిధ ప్రదర్శనా క్షేత్రాలను సందర్శకులకు చూపిస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించారు. పర్యటన ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం లభించగా, డీఏఈఎస్ఐ డీలర్లకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కలిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -