Saturday, May 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

సంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డిలోని ఆర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు గిరిధర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతిచెందాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వేంకటేశ్వర్లు కుమారుడు గిరిధర్ ఆడుకునేందుకు వెళ్లి లిఫ్ట్ ఎక్కాడు. అనంతరం అందులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు స్పందించి అతన్ని బయటకు తీశారు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -