Sunday, May 10, 2026
E-PAPER
Homeసినిమాఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు

ఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు

- Advertisement -

శనివారం కథానాయకుడు విజరు దేవరకొండ బర్త్‌డేని పురస్కరించుకుని ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్‌ సరికొత్త పోస్టర్స్‌ను రిలీజ్‌ చేసి, ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్స్‌ విజరు ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మూడు భిన్న చిత్రాల్లో విజరుదేవరకొండ ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో తెలిపేలా ఉన్న ఈ పోస్టర్స్‌ ఆయా సినిమాలపై అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

విధి అతన్ని రాజును చేసింది..
వైరా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాణంలో దర్శకుడు శౌర్యువ్‌ రూపొందిస్తున్న చిత్రం నుంచి విడుదలైన బర్త్‌డే పోస్టర్‌పై ‘ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..’ అంటూ రాసిన క్యాప్షన్‌, చేతిలో ఖడ్గంతో సింహాసనంపై కూర్చుని ఉన్న విజరు స్టిల్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.

‘రణబాలి’ స్పెషల్‌ మేకింగ్‌ గ్లింప్స్‌
విజరు దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్‌ సంకత్యన్‌ దర్శకుడు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విజరు బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ మేకింగ్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్‌ 11న రిలీజ్‌కు రాబోతోంది.

రూరల్‌ యాక్షన్‌ డ్రామాతో ‘రౌడీ జనార్థన’
విజరు దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న చిత్రం ‘రౌడీ జనార్థన’.దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రవి కిరణ్‌ కోలా దర్శకుడు. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -