Sunday, May 10, 2026
E-PAPER
Homeఆటలుప్రైజ్‌మనీ ఇప్పించండి

ప్రైజ్‌మనీ ఇప్పించండి

- Advertisement -

క్రీడాశాఖకు జీఎం అభిజిత్‌ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : భారత గ్రాండ్‌మాస్టర్‌, ఐదు సార్లు కామనెవెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ అభిజిత్‌ గుప్త టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీ కోసం క్రీడామంత్రిత్వ శాఖను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది జవనరిలో ఒడిశా ఓపెన్‌ విజేతగా నిలిచిన అభిజిత్‌ గుప్త రూ.5.5 లక్ష?ల నగదు బహుమతి అందుకోవాల్సి ఉంది. కానీ ఒడిశా చెస్‌ సోసియేషన్‌లో అంతర్గత కుమ్ములాటల ఫలితంగా బ్యాంక్‌ ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఒడిశా ఓపెన్‌ విజేతలకు నగదు బహుమతి అందించటంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. టోర్నమెంట్‌ ముగిసిన నెల రోజుల్లో ప్రైజ్‌మనీ ఇస్తామని ఒడిశా చెస్‌ సంఘం హామీ ఇచ్చినా.. ఇప్పటివరక అది జరుగలేదు. ఆల్‌ ఇండియా చెస్‌ సమాఖ్య దష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం లేదు. దీంతో క్రీడామంత్రిత్వ శాఖ అధికారులు జోక్యం చేసుకుని క్రీడాకారులకు దక్కాల్సిన నగదు బహుమతిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా అభిజిత్‌ గుప్త విజ్ఞప్తి చేశాడు. అర్జున అవార్డు గ్రాండ్‌మాస్టర్‌కు ఇటువంటి అనుభవం ఎదురైతే, క్ష?్ఱత్రస్థాయిలో క్రీడాకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవాలని అజిజిత్‌ గుప్త వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -