Sunday, May 10, 2026
E-PAPER
Homeఆటలుయశస్వి, షెఫాలీకు నాడా నోటీసులు

యశస్వి, షెఫాలీకు నాడా నోటీసులు

- Advertisement -

వేర్‌అబౌట్స్‌ సమాచారం ఇవ్వటంలో విఫలం
న్యూఢిల్లీ : భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, షెఫాలీ వర్మకు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. రిజస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌ (ఆర్‌టీపీ)లో ఉన్న యశస్వి జైస్వాల్‌, షెఫాలీ వర్మ నాడా అధికారులకు వేర్‌అబౌంట్స్‌ సమాచారం ఇవ్వటంలో విఫలమైనట్టు తెలిసింది. షెడ్యూల్‌ శాంపిల్‌ సేకరణకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండలేదు. శాంపిల్‌ సేకరణకు అందుబాటులో లేకపోవటంతో తొలి వేర్‌ అబౌట్‌ ఫెయిల్యూర్‌గా పరిగణించి ఇద్దరు క్రికెటర్లకు నోటీసులు జారీ చేయటంతో పాటు బీసీసీఐ, ఐసీసీకి సమాచారం అందించినట్టు తెలిసింది. బీసీసీఐ అధికారి సైతం ఈ విషయాన్ని దవీకరించారు. ‘ టెస్టులకు హాజరుకాని అంశంపై నాడా నుంచి నోటీసులు అందాయి. ఫెయిల్యూర్‌ ఎందుకు జరిగిందని క్రికెటర్లతో అడిగి తెలుసుకున్నాం. భవిష్యత్‌లో పునరావత కాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. క్రికెట్‌ ఒలింపిక్స్‌లో భాగమైంది. వాడా ప్రామాణిక నిబంధనలు పాటించాలని’ ఆ అధికారి తెలిపారు. ఓ ఏడాదిలో మూడు సార్లు వేర్‌అబౌట్‌ ఫెయిల్యూర్‌ డోపింగ్‌ కిందకే వస్తుంది. ప్రస్తుతం నాడా ఆర్‌టీపీలో 348 మంది అథ్లెట్లు ఉండగా, అందులో 13 మంది క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతుండగా.. షెఫాలీ వర్మ ఇటీవల దక్షణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. భారత క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కెఎల్‌ రాహుల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, తిలక్‌ వర్మ సైతం నాడా ఆర్‌టీపీలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -