Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయంకరిగిపోతోన్న భారత ఫారెక్స్‌ నిల్వలు

కరిగిపోతోన్న భారత ఫారెక్స్‌ నిల్వలు

- Advertisement -

వారంలో 7.79 బిలియన్‌ డాలర్లు తగ్గుదల
ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది మే 1తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 7.794 బిలియన్‌ డాలర్లు తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అంతకు ముందు వారం కూడా ఈ నిల్వలు 4.82 బిలియన్‌ డాలర్ల మేర క్షీణించాయి. ఇంతక్రితం 2026 ఫిబ్రవరి 27తో ముగిసిన వారం లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 728.494 బిలియన్‌ డాలర్ల ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయిని తాకా యి. ఆ తర్వాత అమెరికా సామ్రా జ్యవాద విధానాలతో పశ్చిమాసి యాలో తలెత్తిన భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతల కారణంగా భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి ఏర్ప డింది. రూపాయి విలువ పడిపో కుండా నియంత్రించేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకుని డాలర్ల ను విక్రయించడంతో నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం.. విదేశీ మారక నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 2.797 బిలి యన్‌ డాలర్లు తగ్గి 551.825 బిలియన్‌ డాలర్లకు పడిపో యాయి. ఇదే సమయంలో బంగా రం నిల్వలు కూడా 5.021 బిలియన్‌ డాలర్ల భారీ తగ్గుదలతో 115.216 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు అంతర్జా తీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద ఉండే స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ స్వల్పంగా 15 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.789 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -