టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండ బోయే ఈ సినిమా, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్లో మొట్ట మొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమాక్స్ 8కె ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం విఫలమైనప్పుడు ‘మానిటీ’ ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకతి లేదా ఒక అదశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భు తంగా రాసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేయడమే కాకుండా, సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని వెల్లడించారు. ఇలాంటి కాన్సెప్ట్‌ను హీరోలతో సాధ్యం చేసి చూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ప్రస్తు తానికి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని బీఎస్ రావు తెలిపారు.


