బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవడంలో జుట్టు, తల చర్మం ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవి నెలల్లో అధిక వేడి, తేమ, చెమట, ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, తల చర్మం పొడిబారి, జుట్టు రాలడం, చిక్కుపడటం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, కాలానుగుణ నష్టం నుంచి జుట్టును కాపాడటానికి మన రోజువారీ అలవాట్లు జుట్టు సంరక్షణ పద్ధతులు చాలా కీలకమవుతాయి. ుట్టు సంరక్షణ అనేది కేవలం పైపైన చేసే చికిత్సల మీద మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం, రోజువారీ అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా జుట్టుకు పోషణ ఇస్తూ, ఎండ నుంచి రక్షణ కల్పిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. జుట్టు శుభ్రత విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. కెమికల్స్ తక్కువగా ఉండే మైల్డ్ హెర్బల్ షాంపూల్ని ఉపయోగించండి. హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటి హీట్ స్టైలింగ్ పరికరాలకు వేసవిలో దూరంగా ఉండటం మంచిది.
తరచుగా రసాయనాలతో కూడిన హెయిర్ ట్రీట్‌మెంట్స్ చేయించుకోకండి. బయటకు వెళ్లేటప్పు స్కార్ప్ లేదా టోపీ ధరించండి. ఇది సూర్యుని యూవీ కిరణాల నుంచి జుట్టును కాపాడుతుంది. వీలైతే యూవీ ప్రొటెక్షన్ ఉన్న హెయిర్ కేర్ ఉత్పత్తుల్ని వాడండి. జుట్టును చాలా టైట్‌గా ముడివేయడం వల్ల చెమట పేరుకుపోయి జుట్టు రాలే ప్రమాదం ఉంది. లూజ్ జడలు లేదా క్లిప్పులు వాడటం ఉత్తమం.
ఆహారం, జీవనశైలి
హైడ్రేషన్: వేసవిలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. శరీరం లోపల నుంచి హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు తాగాలి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగండి.
తగినంత నిద్ర: ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
పోషకాహారం: జుట్టు ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు లోపల నుంచి బలంగా పెరుగుతుంది.
అనుసరించాల్సిన చిట్కాలు
- Advertisement -
- Advertisement -


