జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్‌రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
విషపూరిత పురుగుమందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
విడుదల చేసిన పోస్టర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. ఒక భయానక నిజాన్ని బయటపెట్టేందుకు వారు చేసే పోరాటాన్ని ఈ పోస్టర్ సూచిస్తోంది.
కూరగాయల మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ పోస్టర్‌లో ఇద్దరూ ఆగ్రహంతో ఉన్న వ్యాపారుల మధ్య చిక్కుకున్నట్లు చూపించారు. చుట్టూ ఉన్న జనాలు వారిపై కూరగాయలు విసురుతూ, వేలెత్తి చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజల్, శ్రేయాస్ ముఖాల్లో కనిపించే భయం, చుట్టూ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసే వారికి ఎదురయ్యే ప్రతిఘటనను బలంగా చూపిస్తోంది.
విషాన్ని పండిస్తే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


