- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథను అరెస్టు చేయాలని.. DYFI,AIDWA,SFI ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహబూబ్ నగర్, హనుమకొండ DYFI,AIDWA,SFI నిరసనలు చేపట్టాయి. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద బండి భగీరథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్ పాత్రపై విచారణ చేపట్టి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నుంచి కేంద్రమంత్రి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో బండి భగీరథ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

- Advertisement -



