– మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలి
– జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
నవతెలంగాణ – జుక్కల్
మంగళవారం హైదరాబాద్‌లో మంత్రివర్యులు, మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగుతూ, ఉన్నత పదవుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నియోజక వర్గంలోని మైనారిటీ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మైనారిటీ విద్యార్థులకు స్కూల్ స్థాయి నుండి పీజీ వరకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అనంతరం మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
మంత్రి అజారుద్దీన్ ను కలిసిన ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



