- Advertisement -
- నెక్లెస్ రోడ్ ప్లాజా వద్ద విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్: పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్లాజా వద్ద విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఓ బాలికపై లైంగిక దాడి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సిట్ (SIT) చీఫ్ కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ వేగవంతం చేసింది.
- Advertisement -



