- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డేల నుంచి రిటైర్ అయ్యారని ఇటీవల కోచ్ కోచ్ డారెన్ సమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సమి మరోసారి స్పందించారు. హోల్డర్ రిటైర్ కాలేదని స్పష్టత ఇచ్చారు. ఇటీవల తాను హోల్డర్ అంతర్జాతీయ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆయన వన్డేల నుంచి రిటైర్ అయ్యాడని తప్పుగా చెప్పినట్లు అంగీకరించారు. ఆ పదాలు ఉపయోగించాల్సింది కాదని, దీనివల్ల ఏర్పడిన గందరగోళానికి హోల్డర్‌తో పాటు వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు సమి వివరించారు.
- Advertisement -



