- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ చేసిన ప్రతి ఒక్కరిని జైలులో వేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వలోనే రీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేస్తామని, ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయమని, రద్దు అయిన పరీక్షకు సంబంధించి ఫీజులను విద్యార్థులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నీట్ లీకేజీ వ్యవహరంపై సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తామన్నారు. రాజస్థాన్‌లో పేపర్ లీకేజీ కారణంగా ఈనెల 3న నిర్వహించిన నీట్ ఎగ్జామ్ రద్దు అయిన విషయం తెలిసిందే.
- Advertisement -



