నవతెలంగాణ-హైదరాబాద్: భారత రెజ్లింగ్ సమాఖ్యపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేస్తోన్న పోరాటానికి ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ మద్దతుగా నిలిచారు. రెజ్లింగ్‌లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వినేశ్‌కు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి నిరాకరించడంపై సాక్షి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా వినేశ్‌పై డబ్ల్యూఎఫ్ఐ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. రిటైర్‌మెంట్ నిబంధనలు, యాంటీ డోపింగ్ ప్రక్రియలను కారణంగా చూపుతూ వినేశ్ ప్రస్తుతం పోటీలకు అనర్హురాలని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. మాతృత్వం తర్వాత మరింత సహకారం అందించాల్సింది పోయి.. ఇలాంటి అడ్డంకులు సృష్టించడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడాశాఖ మంత్రితో పాటు డబ్ల్యూఎఫ్ఐను విజ్ఞప్తి చేస్తున్నా. వినేశ్‌కు ట్రయల్స్ అవకాశం ఇవ్వాలి. ఆమె దేశానికి పతకాలు సాధించి మహిళలు మాతృత్వం తర్వాత కూడా క్రీడల్లో రాణించగలరని నిరూపించాలి’ అని సాక్షి మాలిక్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు మద్దతుగా సాక్షి మాలిక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



