ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఆర్ కే దీక్ష. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. పెద్దగా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్‌తో హీరో పాత్రను తీర్చిదిద్దాం. హీరో కిరణ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అక్స ఖాన్ డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. రోహిత్ శర్మ నెగిటివ్ రోల్‌లో నటించారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన పాటలు అందించారు. మన వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు అని అన్నారు.
దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే?
- Advertisement -
- Advertisement -



