Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం 

ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
గత కొద్దిరోజులుగా నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్మల్ డైరీ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సమస్యను సీఎం ఎ.రేవంత్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాడి రైతులను, డైరీ కార్మికులను గట్టెక్కించేందుకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ తో సీఎం సహాయంతో ఒప్పందం కుదిర్చారు. అంతేకాకుండా మొదటి విడతగా రూ.10 కోట్ల నిధులు కూడా మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, బీర్ల ఐలయ్య చిత్రపటాలకు ఆలేరు పట్టణంలో నార్మల్ మదర్ డైరీ వద్ద మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -