- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
1-19 ఏండ్ల గల పిల్లలకు అల్పెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా అన్నారు. జూలై 13న నులిపురుగుల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో సోమవారం సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎదుగుతున్న చిన్నారులకు ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, అంగన్వాడి చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -



