Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలకు జింకల బెడద

పంటలకు జింకల బెడద

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఈ ఏడాది వర్షాకాలం అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. మున్ముందు వర్షాలు పడతాయనే భరోసాతో మండల పరిధిలోని రైతులు సోయా, పెసర, మినుములు, పత్తి పంటలు భారీగానే సాగు చేస్తున్నారు. అయితే గత 15 రోజులుగా వర్షాలు పడిన దాఖలాలే లేవు. చాలా గ్రామాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోయా, మినుము పంటలు సాగు చేస్తున్న భూములు వానలు రాక బీటలు వారుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి, పంటసాగు చేసిన రైతన్నలు వరుణుడి కోసం దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. కాస్త వర్షాభావం ఉన్న గ్రామాలలో మొలకలెత్తి, ఎదుగుతున్న పంటలకు జింకల బెడద పట్టుకుంది. ముఖ్యంగా సోయా పంటలను జింకలు భారీగా నష్టపరుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షాలు కురవక, మరోవైపు జింకల బెడదతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి, జింకలను అదుపుచేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -