భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.బుధవారం కాటారం,మల్హర్ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించారు.కాటారం వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించి,కొండంపేట,కొయ్యుర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.జాప్యం లేకుండా దాన్యం కొనుగోలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల వద్ద తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రవాణా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. రోజుకు రెండు లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆదేశించారు.
కచ్చితమైన రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని శుభ్రపరచాలని తాలు, రాళ్లు ,మట్టి గుల్లలు లేని నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రైతుల సహకరించాలన్నారు. ప్యాడి క్లీనింగ్ పరికరాలు అందుబాటులో లేకపోతే మరొక చోట నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంత కుమారి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు,తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,తహశీల్దార్ రవికుమార్, సిఈఓ సంతోష్ పాల్గొన్నారు.



